calender_icon.png 4 February, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫేక్ ఫోన్ పే యాప్​తో మోసం..

03-02-2025 11:15:26 PM

కామారెడ్డి (విజయక్రాంతి): ఫేక్ ఫోన్ పే యాప్ తో మోసం చేస్తున్న యువకుడ్ని సోమవారం స్థానికులు పట్టుకొని దేహశుద్ధి చేసిన ఘటన కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లిలో చోటుచేసుకుంది. అనంతరం ఆ వ్యక్తిని  ప్రజలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన సోమవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. కామారెడ్డి పట్టణంలోని గొల్లవాడకు చెందిన ప్రవీణ్ ఫేక్ ఫోన్ పే యాప్ డౌన్​ లోడ్​ చేసుకున్నాడు. డబ్బులు ఇస్తే ఫోన్ పే చేస్తానని కొందరిని నమ్మించాడు. దేవునిపల్లి గ్రామంలోని ఓ కిరాణా షాప్ వద్దకు వెళ్లి డబ్బులు ఇవ్వండి ఫోన్ పే చేస్తానని చెప్పాడు. దీంతో కిరాణా షాప్ యజమాని డబ్బులు ఇవ్వడంతో ప్రవీణ్ ఫోన్ పే చేశాడు. ప్రవీణ్ ఫోన్​లో డబ్బులు సెండ్ అయినట్లు చూపించినా కిరాణా షాప్ యజమాని అకౌంట్లో మాత్రం జమ కాలేదు. దీంతో మోసపోయినట్లు గ్రహించి ప్రవీణ్​ను నిలదీయగా అది ఫేక్ ఫోన్ పే యాప్ అని ఒప్పుకున్నాడు. దీంతో స్థానికులు ప్రవీణ్​ను పోలీసులకు అప్పగించారు.