calender_icon.png 25 December, 2024 | 1:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ బంగారు బిస్కెట్లతో మోసం

31-07-2024 08:35:15 PM

సంగారెడ్డి: బీరంగూడ మల్లికార్జుననగర్ కాలనీలో మోసం వెలుగుచూసింది. రమణమ్మ అనే మహిళా కిరాణం దుకాణం నడుపుతున్న రాజేశ్వరిని మోసం చేసింది. కుమార్తె వివాహానికి అప్పు ఇప్పించాలని రాజేశ్వరిని కోరిన రమణమ్మ షూరిటీగా గోల్కొండ తవ్వకాల్లో దొరికిన బంగారం ఉంచుతామని దంపతులు చెప్పారు. దంపతుల మాటలను నిజమని నమ్మిన రాజేశ్వరి నకిలీ బంగారు బిస్కెట్ తీసుకుని రూ.4లక్షలు ఇచ్చింది. రాజేశ్వరి ఐదు రోజుల తర్వాత రమణమ్మకు ఫోన్ చేయగా స్వీచ్ఆఫ్ అని రావడంతో అనుమానం వచ్చి బంగారాన్ని గీటు చేయించింది. దీంతో అవి నకిలీదని తేలడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.