calender_icon.png 23 December, 2024 | 5:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూత్ డిక్లరేషన్ పేరుతో మోసం

08-10-2024 01:10:26 AM

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ 

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేసిందని, పదినెలల పాలనలో ఒక నోటిఫికేషన్ ఇవ్వలేదని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. అబబ్ధాలకు బ్రాండ్ అంబాసిడర్‌గా సీఎం రేవంత్‌రెడ్డి మారారని ఎద్దేవా చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈవెంట్ మేనేజ్‌మెంట్ మాదిరిగా బీఆర్‌ఎస్ ఇచ్చిన నోటిఫకేషన్లకు నియామక పత్రాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ పాలనలో 1.60 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని స్పష్టం చేశారు. రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా తప్పించుకొని తిరుగుతుందని వాపోయారు. వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగులు కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలన్నారు.