29-10-2024 01:12:39 AM
బెల్లంపల్లి, అక్టోబర్ 28 (విజయక్రాంతి): బ్యాక్ డోర్‌లో సింగరేణి కొలువు ఇప్పిస్తానని ఓ వ్యక్తి నిరుద్యోగులను నమ్మబలికి, వారి నుంచి భారీగా డబ్బు వసూలు చేసి, ఆ తర్వాత ముఖం చాటేసిన ఘటన బెల్లంపల్లి పట్టణంలో వెలుగు చూసింది. ఓ బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని కాల్‌టెక్స్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఓ ఎమ్మెల్యే తనకు దగ్గరి బంధువు అని, గోదావరిఖని ఓపెన్‌కాస్ట్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పలువురు నిరుద్యోగులను నమ్మించాడు.
కొందరి నుంచి భారీగా డబ్బులు గుంజాడు. డబ్బు ముట్టజెప్పిన వా రు కొన్నిరోజుల తర్వాత తమ ఉద్యోగం ఏమైందని ఆ వ్యక్తిని నిలదీశారు. అతడి నుంచి ఎలాంటి సమా ధానం రాలేదు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.