calender_icon.png 13 January, 2025 | 2:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫొటోషూట్ పేరుతో మోసం

01-08-2024 04:24:53 AM

  1. విలువైన కెమెరాలు చోరీ 
  2. నిందితుడిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు 

చార్మినార్, జూలై 31: ఫొటోషూట్‌ల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మీర్‌చౌక్ పోలీసులు అరెస్టు చేసి రిమాం డ్‌కు తరలించారు. వివరాలిలా ఉన్నాయి.. బెంగళూర్‌లోని సౌత్ కెంగేరి ప్రాంతానికి చెందిన ఫొటోగ్రాఫర్ బీ చలపతి గత ఆరేళ్లు గా ఫొటో స్టూడియో సరిగ్గా నడవకపోవ డంతో ఆర్థికంగా నష్టపోయాడు. దీనికి తోడు రోడ్డు ప్రమాదంలో కాలు విరిగింది. దీంతో ఆర్థిక సమస్యలు వెంటాడుతు న్నాయి. ఈ క్రమంలో ఈజీగా డబ్బులు సంపాదించడానికి ఫొటో కెమెరాలను చోరీ చేసే పనిలో పడ్డాడు. ఓ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు  వేరే ఫొటోగ్రాఫర్లను నమ్మించి ఫొటో షూట్‌ల కోసం స్టూడి యోలను ఎంచుకొని ఆర్డర్ ఇవ్వడం.. ఫొటో షూట్ అయిపోయిన వెంటనే విలువైన కెమె రాలతో ఊడయించడం పనిగా పెట్టుకు న్నాడు.

ఈ క్రమంలో నిందితుడు చలపతి తన పేరును మనోజ్‌కు మార్చుకున్నాడు. ఇదేవిధంగా గత నెల 24న హైదరాబాద్‌కు వచ్చి అమీర్‌పేట్‌లోని కృష్ణానగర్ ప్రాంతాని కి చెందిన ఫొటోగ్రాఫర్ పుప్పాల రాకేశ్‌ను సంప్రదించాడు. నగరంలోని పలు ప్రాంతా ల్లో రాకేశ్‌తో ఫొటో షూట్ చేయించాడు. ఆ తర్వాత విలువైన కెమెరాలతో పారిపో యాడు. ఫోన్ చేసినా సమాధానం రాకపోవ డంతో మోసపోయానని గ్రహించిన రాకేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు ఈ నెల 30న నిందితు డిని గుర్తించారు. బుధవారం నిందితుడి నుంచి రూ.9 లక్షల విలువ చేసే కెమెరాలతో పాటు ఇతర వస్తువులను స్వాధీనం చేసుకొ ని జైలుకు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ రవీంద్ర తెలిపారు.