సైబర్‌క్రైమ్ పోలీసుల అదుపులో నిందితులు
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): పార్ట్ టైమ్ జాబ్‌లో భారీ లాభాల పేరిట మోసం చేస్తున్న ముఠాను సైబర్‌క్రైమ్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. వారి నుంచి ఆరు మొబైల్స్, క్యాష్ కౌంటింగ్ మిషన్, 11 పాస్ బుక్‌లు, 6 చెక్ బుక్‌లు, 3 డెబిట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
సైబర్ క్రైమ్ డీసీపీ దార కవిత తెలిపిన ప్రకారం ఖైరతాబాద్‌కు చెందిన పాలడుగుల దేవకృప, విజయవాడకు చెంది న వీవీ శివశంకర్, రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లికి చెందిన బేతం బాలరాజు, రంగారెడ్డి జిల్లా కాళీమందిర్‌కు చెందిన ఎన్‌ఎస్ ప్రజ్వల్ రెడ్డి, మణికొండకు చెందిన సీ విజయ్‌సాగర్ అనే వ్యక్తులు అమాయకులకు ఫోన్ చేసి నౌకరి.
డాట్‌కామ్ నుంచి మాట్లాడుతున్నట్లు నమ్మిస్తారు. తమ వద్ద పార్ట్ టైమ్ జాబ్స్ ఉన్నాయంటూ నమ్మిస్తారు. కొన్నిసార్లు వారికి డబ్బులు వచ్చేలా చేసి డబ్బు ఆశచూపి నగదును డిపాజిట్ చేయించుకుంటారు. ఈ విధంగా ఓ వ్యక్తి నుంచి ఏకంగా రూ.1.93 లక్షలు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు.