హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (విజయక్రాంతి): నగరానికి చెందిన ఓ గృహిణి(56)కి ఆన్‌లైన్‌లో లోన్ ఇస్తామ ని ఓ కాల్ వచ్చింది. ఆసక్తి చూపిన బాధితురాలు లోన్ కావాలని వారితో చెప్పింది. దీంతో మొదటగా పలు చార్జీలు చెల్లించాల్సి ఉం టుందని మాయమాటలు చెప్పి బాధితురాలితో పలు దఫాలుగా రూ.2.34 లక్షలు కట్టించుకున్నారు.
అనంతరం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఒక్క క్లిక్‌తో..
సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి (52) అనుకోకుండా తన సెల్‌ఫోన్‌లో ‘ఎలక్ట్రిసిటీ వ్యూ’, ‘విడ్‌మేట్.ఏపీకె’ అనే ఫైల్స్‌పై క్లిక్ చేశాడు. దీంతో ఆ యాప్‌లు అతడి ఫోన్‌లో డౌన్‌లోడ్ అయ్యాయి. అనంతరం తన ప్రమేయం లేకుండానే బాధితుడి ఖాతాలో ఉన్న రూ.1.97 లక్షల నగదు బదిలీ అయ్యాయి.
గమనించిన బాధితుడు తన సోదరుడికి డబ్బు పంపేందుకు యత్నించాడు. అది తిరస్కరణకు గురికావడంతో యాప్‌లు డౌన్‌లోడ్ చేయడం డబ్బులు బదిలీ అయినట్లు తెలుసుకున్నాడు. దీంతో మోసపోయానని గుర్తించి బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.