calender_icon.png 15 November, 2024 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆన్‌లైన్ జాబ్స్ పేరుతో సైబర్ మోసం

15-11-2024 01:26:53 AM

బాధితుడి ఖాతా నుంచి రూ.7.82 లక్షలు మాయం

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 14 (విజయక్రాంతి): ఆన్‌లైన్ ఉద్యోగం పేరుతో ఓ వ్యక్తిని బురిడీ కొట్టించి సైబర్ నేరగాళ్లు రూ.7.82 లక్షలు కాజేశారు. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి(38)కి ఆన్‌లైన్ జాబ్ పేరిట టెలిగ్రామ్‌లో మేసేజ్ వచ్చింది.

బాధితుడు వాటిపై ఆసక్తి కనబర్చడంతో..  స్కామర్లు బాధితుడికి టెలిగ్రామ్‌లో ఓ లింక్ పంపించా రు. మొదటగా ఆన్‌లైన్‌లో ఏదైనా ఆర్డర్ చేయమని బాధితుడికి చెప్పారు. మరుసటి రోజు ఉద్యోగం కోసం చార్జీల రూపంలో రూ.10 వేలు చెల్లించాలని స్కామర్లు సూచించారు.  అనంతరం ట్రేడింగ్ యాక్సెస్ లింక్‌ను పంపారు.

ఆ తర్వాత ఉద్యోగం పొందడానికి మరో రూ.30 వేలు చెల్లించాలని చెప్పడంతో బాధితుడు వాటిని కూడా చెల్లించాడు. ఇలా పలు దఫాలుగా బాధితుడి నుంచి మొత్తం రూ.7.82 లక్షలు పెట్టుబడిగా పెట్టించారు. తర్వాత వారి నుంచి స్పందన రాకపోవడంతో గురువారం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.