calender_icon.png 2 February, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్కీ డ్రా పేరిట మోసం

02-02-2025 01:03:50 AM

* బంగారు గొలుసుతో ఉడాయింపు

ఆదిలాబాద్, ఫిబ్రవరి 1 (విజయక్రాంతి): ఓ మహిళకు మాయమాట లు చెప్పి బంగారు గొలుసుతో ఓ యువకుడు ఉడాయించిన ఘటన ఆదిలాబాద్‌లో జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేర కు.. స్థానిక ఇంద్రానగర్‌లో అనసూయ అనే మహిళ ఇంటి నిర్మా ణం చేపడుతుంది.

శనివారం మహిళ దగ్గరికి వచ్చిన గుర్తు తెలియని యువకుడు ఇంటి నిర్మాణానికి సిమెంట్ బ్యాగులను తీసుకోగా సద రు సిమెంట్ కంపెనీ లక్కీ డ్రాలో మీరు ఎంపికయ్యారని మాయ మా టలు చెప్పాడు. లక్కీ డ్రా డబ్బుల కోసం సిమెంట్ షాప్ వద్దకు రావాలంటూ ఆమెను దిచక్రవాహనంపై రైలేస్టేషన్ సమీపంలోని ఓ షాప్ వద్దకు తీసుకెళ్లాడు.

లక్కీ డ్రా డబ్బులు రావాలంటే ముందుగా మెడలో ఉన్న రెండున్నర తులాల బంగారు గొలుసు ఇవాలని, గొలుసును తూకం వేసుకొని వస్తానని చెప్పి వెళ్లాడు. ఎంతకు రాకపోవడంతో మోసపోయిన సదరు మహి ళ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు ఆధారంగా విచారణ చేపడుతున్నారు.