calender_icon.png 18 January, 2025 | 3:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐపీవో పెట్టుబడుల పేరుతో మోసం

08-08-2024 03:25:08 AM

రూ. 6.14 లక్షలు దోచిన సైబర్ నేరగాళ్లు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసంతో అమాయక ప్రజలను నిండా ముంచుతున్నారు. తాజాగా ఐపీవో (షేర్ల కొనుగోలు, విక్రయాలు) పెట్టుబడుల పేరుతో రూ. 6.14 లక్షలు దోచుకున్నారు. నగరానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి(58)కి ఐపీవో(పబ్లిక్ ఇనిషియల్ ఆఫరింగ్)లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు పొందొచ్చని వాట్సాప్‌లో మెసేజ్ వచ్చింది. దీంతో అతడు ఐపీవోలో పెట్టుబడి పెట్టాడు. బాధితుడు పెట్టుబడి పెట్టిన లావాదేవీలను చూసుకోవడానికి సైబర్ నేరగాళ్లు ఓ ఖాతాను ఇచ్చారు. మొదట్లో బాధితుడు కొనుగోలు చేసిన షేర్లు విక్రయించి కొద్ది మొత్తంలో లాభాలు పొందాడు. అనంతరం సైబర్ నేరగాళ్ల సూచన మేరకు కేసీ ఎంటర్‌ప్రైజెస్, బంధన్ బ్యాంక్, వీకే ఎంటర్ ప్రైజెస్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు తదితర ఐపీవోల్లో మొత్తం రూ.6.14 లక్షలను పెట్టుబడి పెట్టా డు. కానీ తన ఐపీవో ఖాతాలోని డబ్బు విత్‌డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు 10 శాతం చెల్లించాలని స్కామర్లు సూచించారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.