calender_icon.png 16 January, 2025 | 9:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో మోసం

03-07-2024 12:05:00 AM

సిద్దిపేట, జూలై 2 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి, లక్షల్లో డబ్బులు వసూలు చేసిన  మోసగాన్ని సిద్దిపేట వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా అదనపు డీసీపీ మల్లారెడ్డి కథనం ప్రకారం.. దుబ్బాక మండలంలోని తిమ్మాపూర్‌కు చెందిన జోరవంతల సత్యనారాయణ ప్రస్తుతం ఓల్డ్ అల్వాల్‌లో నివాసం ఉంటున్నాడు.  రాష్ట్ర యాంటీ కరప్షన్ ఇంటెలిజెన్స్ కమిటీ జనరల్ సెక్రటరీగా, ప్రైవేటు ఉద్యోగుల సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీగా చెప్పుకుంటూ నకిలీ ఐడీ కార్డులు సృష్టించుకున్నాడు. సిద్ధిపేటలోని శంకర్‌నగర్‌కు చెందిన అయిత వరప్రసాద్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు.

అందుకు రూ.6 లక్షలు ఇవ్వాలని ఒప్పందం చేసుకున్నాడు.  నమ్మిన వరప్రసాద్ విడతల వారీగా మొత్తం డబ్బు చెల్లించాడు. రెండు నెలల్లో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పించకపోవడంతో అనుమానం వచ్చి నిలదీయగా ప్రభుత్వం మారిందని మరికొ న్ని రోజుల గడువు కోరాడు. మోసపోయానని గ్రహించిన వరప్రసాద్ తన డబ్బులు తిరిగి ఇవ్వాలనికోరగా.. డబ్బులు అడిగితే చంపుతానని బెదిరించాడు. దీంతో సిద్దిపేట వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సీఐ లక్ష్మీబాబు నిందితున్ని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.