07-03-2025 12:05:25 AM
నలుగురిని అదుపులో తీసుకున్న పోలీసులు
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (విజయక్రాంతి): డబుల్ బెడ్రూంలు ఇప్పిస్తామని, అమాయకులను మో చేస్తున్న నలుగురిని హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి నకిలీ డబుల్ బెడ్రూంల కేటాయింపు పత్రాలు, రబ్బర్ స్టాంపులు, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ అందె శ్రీని తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఛత్రినాకాకు చెందిన ఎం జ్యోతి, సునిల్ సింగ్ అనే వ్యక్తులు హైదరాబాద్ పరిసరాల్లో డబుల్‌బెడ్రూంలు ఇప్పిస్తామని అమాయకుల నుంచి రూ.10 20 వేలు వసూలు చేశారు. వారికి సహాయకంగా జీ రమేశ్, నితిన్‌కుమార్ అనే వ్యక్తులను నియమించుకున్నారు. హై సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఛత్రికానా పోలీసులతో కలిసి నిందితులను అరెస్ట్ చేశారు.