అంతర్రాష్ర్ట ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
ఆదిలాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి) : నకిలీ బంగారాన్ని అంటగడుతూ ప్రజలను మోసగిస్తున్న అంతరాష్ర్ట ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం వివరాలు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నాగరా జ్, దేవరాజ్ తిమ్మరాజ్, సుధాకర్, గోపాల్, ప్రవీణ్ ఐదుగురు ముఠాగా ఏర్పడి నకిలీ బంగారాన్ని ప్రజలకు అమ్ముతూ మోసగిస్తున్నారు.
తాజాగా అనంతపూర్ నుంచి కారు లో వచ్చిన ఈ ఐదుగురు ఆదిలాబాద్‌లోని రాధాకృష్ణ లాడ్జిలో రూమ్ కోసమని వెళ్లా రు. ఇద్దరు లాడ్జీ యజమాని జైపాల్‌తో కలి సి రూమ్ చూసేందుకు పైఅంతస్తుకు వెళ్లా రు. అంతలోనే బయట ఉన్న మరో ముగ్గు రు డబ్బుల కోసం కౌంటర్‌ను తెరిచే ప్రయ త్నం చేయగా తెరుచుకోలేదు. దీంతో కౌంటర్‌పై ఉన్న రిజిస్టర్లను ఎత్తుకెళ్లారు. పైనుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు రూమ్ సరిగ్గా లేద ంటూ వెళ్లిపోయారు.
కౌంటర్ వద్ద చిందరవందంగా ఉండటంతో లాడ్జి యజమానికి అనుమానం వచ్చి సీసీ కెమెరాలు పరిశీలించగా దొంగతనానికి యత్నించినట్టు గుర్తిం చాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై ఇసాక్ పట్టణంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద నాగరాజ్, తిమ్మరాజులను పట్టుకున్నారు. వారిని విచారించగా నకిలీ బంగారం గుట్టు బైటపడినట్లు డీఎస్పీ తెలిపారు. పరారీలో ఉన్న సుధాకర్, గోపాల్, ప్రసాద్‌ల కోసం గాలిస్తున్నట్టు పేర్కొన్నారు.