కోదాడ,(విజయక్రాంతి): మోతే మండల పరిధిలోని బురకచర్ల గ్రామంలో ఎపిజివిబి మినీ బ్యాంక్ నిర్వాహకుడు ఆనంతుల రవి భారీ మోసాలకు పాల్పడుతున్న ఘటన మోతె మండల కేంద్రంలో వెలుగుచూసింది. మినీ బ్యాంక్ నిర్వాకుడు గ్రామంలో ఉన్న సంఘ బంధం డబ్బులు నెల నెల కట్టుకుంటు అలాగే 2023 సెప్టెంబర్ నెల శ్రీ చైతన్య సంఘానికి సంబంధించిన 37 వేల రూపాయలు అదే విధంగా 2023 డిసెంబర్ నెల 40 వేల రూపాయలను మొత్తంగా ఆ సంఘానికి సంబంధించిన 77 వేలు సొంతంగా వాడుకున్నట్లుగా అలాగే జాన్సిలక్ష్మి భాయ్ సంఘానికి సమందించిన 25 వేలు సొంతంగా వాడుకున్నాడని బురకచర్ల గ్రామానికి చెందిన సంఘబంధం లీడర్స్, సభ్యులు ఎపిజివిబి మోతె శాఖ ముందు ధర్నాకు దిగారు. మినీ బ్యాంక్ నిర్వాకుడు అన్ని సంఘబంధాలను మోసం చేస్తున్నట్లు అలాగే చదువు రాని వారిని టార్గెట్ చేసుకుంటూ ఫింగర్ పెట్టించుకొని సాధారణ రైతుల వద్ద అకౌంట్లలో డబ్బులు విత్ డ్రా చేసుకుంటాడాని ఆయన బాధితులు చాలా మంది ఉన్నారని ఆ గ్రామస్థులు ఆరోపించారు.