26-03-2025 12:59:20 AM
ప్రభుత్వ పాఠశాలకు నాలుగు తరగతి గదుల ఏర్పాటు
రాజేంద్రనగర్, మార్చి 25 (విజయ క్రాంతి): ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ సంస్థ ఉదారత చాటుకుంది. ప్రభుత్వ పాఠశాలకు ఉచితంగా నాలుగు గదులు నిర్మించి ఇచ్చిం ది. వివరాలు.. అత్తాపూర్ లోని జడ్పీహెచ్‌ఎస్ కు ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ వారి ఆర్థిక సహాయంతో, రౌండ్ టేబుల్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ వారు కలిసి నాలుగు తరగతి గదులతో పాటు మూత్రశాలలో నిర్మించి ఇచ్చారు. మంగళవారం వాటిని ప్రారంభించారు. స్థానిక పాఠశాల ఉపాధ్యాయురాలు శ్రీలత,మండల విద్యాశాఖ అధికా రి శంకర్ రాథోడ్, స్థానిక కార్పొరేటర్ సంగీత వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో విద్యార్థులకు మరిన్ని వసతులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సంద ర్భంగా ఫ్రాక్లిన్ టెంపుల్ టన్ ప్రతినిధి నాగలక్ష్మి మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్ష ణగా చదువుకొని మంచి ఫలితాలు సాధించినప్పుడే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రతినిధులు గౌరవ్, నాగలక్ష్మి, రౌండ్ టేబుల్ ఇండియా చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు మక్సుద్ అహ్మద్, చైతన్య, హర్షిత్, లోకేష్, సీతారాం, రాజేంద్రనగర్ మండల టిఆర్టి ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సాగర్, పాఠశాల ఉపాధ్యాయులు విజయ బేగం, సాయి ప్రసాదరావు, రోజారాణి, సుజాత, జ్యోతి, జకీరబేగం,హేమలత, రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.