calender_icon.png 26 December, 2024 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భారీగా తగ్గిన ఎఫ్‌పీఐ పెట్టుబడులు

26-12-2024 12:00:00 AM

ముంబై, డిసెంబర్ 25: ప్రస్తుత క్యా లండర్ సంవత్సరం 2024లో దేశీయ మార్కెట్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐలు) పెట్టుబడులు భారీగా తగ్గా యి. ఈ ఏడాది ఎఫ్‌పీఐలు నికరంగా రూ.5,000 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశా రు. దేశీయ స్టాక్స్ విలువలు అధికంగా ఉండటం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో విదేశీ ఇన్వెస్టర్లు జాగ్రత్త వ హించారని, ఈ కారణంగా పెట్టుబడులు తగ్గాయని విశ్లేషకులు తెలిపారు.

2024లో ఇప్పటివరకూ ఈక్విటీ మార్కెట్లో రూ. 5,052 కోట్లు, డెట్ మార్కెట్లో రూ.1.12 లక్షల కోట్లు పెట్టుబడి చేసినట్లు డిపాజిటరీల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డెట్ మార్కెట్లో మాత్రం ఎఫ్‌పీఐల పెట్టుబడులు పెరిగాయి. ఈ మార్కెట్లో 2023లో రూ.68.663 కోట్లు ఇన్వెస్ట్‌చేయగా, 2024లో ఈ పెట్టుబడులు రూ.1.12 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2023లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా రూ.1.71 లక్షల కోట్లు ఈక్విటీల్లో నికరంగా పెట్టుబడి చేశారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్, మే, అక్టోబర్, నవంబర్ నెలల్లో మాత్రమే ఎఫ్‌పీఐలు నికరంగా ఇన్వెస్ట్ చేశారు. మిగిలిన నెలల్లో విక్రయాలు జరిపారు.

స్టాక్ విలువలు అధికం

 భారత కంపెనీల అధిక స్టాక్ విలువల కారణంగా ఆకర్షణీయమైన విలువలతో ట్రేడవుతున్న చైనా ఈక్విటీలకు పెట్టుబడు లు తరలించడం కూడా దేశంలోకి వచ్చిన ఎఫ్‌పీఐ నిధులు తగ్గాయని మార్నింగ్‌స్టా ర్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. సెప్టెంబర్ త్రైమాసికంలో కార్పొరేట్ లా భాల బలహీనత, డిసెంబర్ త్రైమాసికపు ఫలితాల పట్ల అంచనాలు తగ్గడం, ద్రవ్యోల్బణం పెరగడం, జీడీపీ వృద్ధి మందగిం  చడం, రూపాయి విలువ క్షీణించడం తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయని గ్రోత్ ఇన్వెస్టింగ్ వ్యవస్థాపకుడు నరేందర్ సింగ్ చెప్పారు. 

వచ్చే ఏడాది రికవరీ

కార్పొరేట్ లాభాల మెరుగుదలతో వ చ్చే 2025లో ఈక్విటీల్లోకి ఎఫ్‌పీఐ నిధు ల ప్రవాహం రికవరీ అవుతుందని అంచ నా వేస్తున్నట్లు వెంచురా సెక్యూరిటీస్ రీ సెర్చ్ హెడ్ వినిత్ బొలింజకర్ చెప్పారు. క్యాపిటల్ గూడ్స్, మాన్యుఫాక్చరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంబంధిత దేశీయ ఆధారిత రంగాల్లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో నిధులు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపారు. అ యితే భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కేం ద్ర బ్యాంక్‌ల వడ్డీ రేట్ల కోతలు, యూఎస్ టారీఫ్‌ల పెంపు తదితర అంశాలు భారత మార్కెట్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులకు అవరో ధం కావచ్చని ఆనంద్‌రాఠి వెల్త్ డిప్యూటీ సీఈవో ఫిరోజ్ అజీజ్ హెచ్చరించారు.