calender_icon.png 2 February, 2025 | 3:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శంకరాభరణంకు 45 ఏళ్లు

02-02-2025 12:48:32 AM

తెలుగు సినిమా కీర్తిని  ప్రపంచా నికి చాటి చెప్పిన కళాత్మక దృశ్య కావ్యం ‘శంకరాభరణం’. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా 45 ఏళ్లు. 1980, ఫిబ్రవరి ౨న ఈ సినిమా ప్రేక్ష కుల ముందుకొచ్చింది. కే విశ్వనాథ్ దర్శకత్వంలో, పూర్ణోదయ ఆర్ట్ క్రియే షన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు, -ఆకాశం శ్రీరాములు నిర్మించారు.

ఈ చిత్రం తెలుగు నాట సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా తమిళనాడు, కర్ణాటక, కేరళల్లో కూడా అఖండ విజయం సాధించి, అప్పట్లోనే పాన్ ఇండియా మూవీగా నిలి చింది. మరెన్నో అవార్డులు సొంతం చేసుకుంది.

చాగంటి కోటేశ్వరరావు శంకరాభరణం చిత్రంపై మూడు రోజుల పాటు ప్రవచనాలు ఇచ్చారు. అలా ఒక చిత్రంపై ప్రవచనం నిర్వహించటం అదే మెదటి సారి. ఈ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఓ ప్రత్యేక గౌరవాన్ని తీసుకు వచ్చింది. జేవీ సోమయాజులును ఈ సినిమా తర్వాత అందరూ శంకరాభరణం శంకరశాస్త్రి అనే పిలిచేవారు.

శాస్త్రీయ సంగీతానికి పెద్దపీట వేసిందీ చిత్రం. మంజుభార్గవి, అల్లు రామలింగయ్య కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర నిర్మాత ఏడిద నాగేశ్వరరావు తాను చెన్నై, హైదరాబాద్‌లో నిర్మించిన ఇళ్లకు శంకరాభరణం అనే పేరు పెట్టుకున్నారు. నాలుగున్నర దశాబ్దాలు గడిచినా.. ఇంకా ఈ చిత్రం ఏదో ఒక మాధ్యమంలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటుంది.