29-03-2025 12:00:00 AM
చర్ల, మార్చి 28: చర్ల మండల సరిహద్దులోని చత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో 45 కిలోల ఐఈడీని భద్రతా బలగాలు శుక్రవారం నిర్వీర్యం చేశారు. చెర్పాల్- మార్గ్ మదర్స్ సెక్యూరిటీ పార్టీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని ఐఈడీ బాంబులను మావోయిస్టులు అమర్చారు.
ఈ బాంబులు కనిపెట్టిన భద్రతా బలగాలు చాకచక్యంగా నిర్వీర్యం చేశాయి. పోలీసులను హతమార్చేందుకు మావోయిస్టులు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తున్నది. భద్రతాబలగాలు మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో ఇటువంటి దారుణాలకు ఒడిగడుతున్నారని పోలీసు ఉన్నతాధికారులు చెపుతున్నారు.