జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి వెల్లడి
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 6(విజయక్రాంతి): ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై 40 ప్రత్యేక తాగునీటి శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి తెలి పారు. శుక్రవారం ట్యాంక్‌బండ్ పరిసరాల్లో శిబిరాల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ట్యాంక్‌బండ్ వద్ద జరగబోయే ప్రజాపాలన విజయోత్సవాల ముగింపు కార్యక్రమాలకు పెద్దఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున జలమండలి ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
ఈ శిబిరాల్లో వాటర్ ప్యాకె ట్లు, డ్రమ్ములలో మంచినీరు అందుబాటులో ఉంటాయన్నారు. 24గంటలూ 2షిఫ్టుల్లో సిబ్బందిని నియమి స్తామని చెప్పారు. సచివాలయం చుట్టుపక్కల ఎక్కడా నీటి లీకేజీలు, సీవరేజీ ఓవర్‌ఫ్లో కాకుండా ముందస్తు చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఈఎన్సీ ప్రవీణ్‌కుమార్, ఆపరేషన్ డైరెక్టర్ అమరేందర్‌రెడ్డి, సీజీఎం ప్రభు, జీఎంలు రామకృష్ణ, హరిశంకర్, జాన్‌షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.