calender_icon.png 16 January, 2025 | 2:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హర్మన్ సేనకు నాలుగో విజయం

13-09-2024 12:46:41 AM

హులున్‌బిర్ (చైనా): ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇప్పటికే సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్న టీమిండియా నాలుగో విజయాన్ని అందుకుంది. గురువారం గ్రూప్ దశలో భారత్ 3 తేడాతో కొరియాను చిత్తు చేసింది. భారత్ తరఫున అరయ్‌జీత్ సింగ్ (ఆట 8వ నిమిషంలో), కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (9వ, 43వ ని.లో) జట్టుకు గోల్స్ అందించారు. ప్రపంచంలోనే ఉత్తమ డ్రాగ్‌ఫ్లికర్లలో ఒకడైన హర్మన్ ప్రీత్ రెండు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడం విశేషం. ఇక కొరియా తరఫున జిహున్ యాంగ్ (30వ ని.లో) ఏకైక గోల్ సాధించాడు. ఇక భారత్ తన చివరి గ్రూప్ మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో శనివారం ఆడనుంది.