calender_icon.png 17 January, 2025 | 8:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగోసారీ.. గ్రీన్ సిగ్నల్!

06-08-2024 12:05:00 AM

స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్.. పరిశ్రమలోకి వచ్చి రెండు దశాబ్దాలవు తోంది. నలభై ఏళ్ల వయసులోనూ తరగని అందం, మరుపు రాని అభినయంతో ప్రేక్షకులను మెప్పించటంలో ఈ సొగసరి తనకు తానే సాటి అని చెప్పాలి. ఇటీవల ‘బ్రింద’తో తొలిసారి ఓటీటీలో కూడా అడుగుపెట్టింది. ఇక బిగ్ స్క్రీన్ ముచ్చట్ల గురించి చెప్పుకుంటే.. ప్రస్తుతం తెలుగులో చిరంజీవితో కలిసి ‘విశ్వంభర’లో నటిస్తోంది. కమల్‌హాసన్ అజిత్ కుమార్‌ల తమిళ చిత్రాలు ‘థగ్ లైఫ్’, ‘విడాముయర్చి’ల్లోనూ భాగమవుతోంది. ఇంకా రెండు మలయాళ సినిమాలూ ఆమె చేతిలో ఉన్నాయి. వరుస సినిమాలతో బిజీగా ఉంటూ కెరీర్ పరంగా కొత్త తోవల్లో నడుస్తున్న త్రిష గురించి ఓ ఆసక్తికర వార్త వినవస్తోంది.

తన సూపర్ సక్సెస్ కోస్టార్ ప్రభాస్‌తో మరో మారు ఆడిపాడనున్నదట. ‘వర్షం’, ‘పౌర్ణమి’, ‘బుజ్జిగాడు’ వంటి సినిమాల్లో ప్రభాస్‌తో కెమిస్ట్రీ పండించింది త్రిష్ణ కృష్ణన్. ఈ ఇద్దరూ కలిసి చివరిసారి స్క్రీన్ పంచుకున్న సినిమా ‘బుజ్జిగాడు’. సినిమానే ఆ తర్వాత ప్రభాస్‌త్రిష కాంబినేషన్‌లో బొమ్మ పడిందే లేదు. అయితే, ఆ జోడీ మళ్లీ జత కట్టబోతోందన్న వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ‘స్పిరిట్’ అనే టైటిల్‌ను లాక్ చేశారు కూడా. ఇందు లో హీరోయిన్‌గా కనిపించే అవకాశం ఉందని టాక్. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని, ఆమె గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని పలు మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. చాలా ఏళ్ల తర్వాత మరోమారు ‘బుజ్జిగాడి’ సరసన తమ ఫేవరేట్ హీరోయిన్ నటించబోతోందన్న వార్త అభిమానులను హర్షపు చినుకులతో తడిపేస్తోంది. ఈ ప్రచారం నిజమై, అధికారిక ప్రకటన వెలువడితే ప్రభాస్ జంట నాలుగో సారి జతకట్టినట్టవుతుంది.