సింగపూర్: వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్ నాలుగో రౌండ్ డ్రాగా ముగిసింది. మూడో రౌండ్లో గెలిచిన గుకేశ్ నాలుగో రౌండ్‌ను డ్రాతో సరిపెట్టాడు. మరోవైపు డింగ్ లిరెన్‌కు మాత్రం ఇది సానుకూలాంశమే అని చెప్పాలి. ప్రస్తుతానికి గుకేశ్, డింగ్ లిరెన్ ఇద్ద రు కూడా రెండేసి పాయింట్లతో సమానంగా ఉన్నారు.
14 రౌండ్లు జరిగే ఈ టోర్నీలో ఏ ఆటగాడు తొలుత 7.5 పాయింట్లు సాధిస్తాడో అతడినే విజయం వరిస్తుంది. గుకేశ్ నాలుగో రైండ్‌లో నల్లపావులతో ఆడాడు. 42 ఎత్తులలో మ్యాచ్ ముగిసింది. ప్రపంచ చెస్ చాంపియన్‌ను భారత్ నుంచి విశ్వనాథన్ ఆనంద్ ఒక్కడే గెలిచాడు.