24-04-2025 01:38:47 AM
ఉప్పల్, ఏప్రిల్ 23: ఐపీఎల్ 18వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస గా నాలుగో విజయాన్ని అందుకుంది. బుధవారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై 7 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై గెలుపొందింది. ఈ గెలుపుతో ముంబై పాయిం ట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకోవడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసి న హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగుల సాధారణ స్కోరుకే పరిమితమైంది.
35 పరు గులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశ లో క్లాసెన్ (71), అభినవ్ మనోహర్ (43) జట్టును ఆదుకున్నారు. ట్రెంట్ బౌల్ట్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం ఛేదనలో దూకుడుగా ఆడిన ముంబై కేవలం 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ (70), సూర్యకుమార్ (40) జట్టును గెలిపించారు. ఉనాద్కట్, మలింగ, అన్సారీ చెరొక వికెట్ తీశారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి నిరసనగా ఆటగాళ్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఇరుజట్లు మృతులకు సంతాపం ప్రకటిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించాయి. నేడు జరగనున్న మ్యాచ్‌లో బెంగళూరుతో రాజస్థాన్ తలపడనుంది.