calender_icon.png 26 October, 2024 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

14 ఏళ్లకే.. ఒలింపిక్ బెర్త్

05-07-2024 01:56:28 AM

స్విమ్మర్ ధినిధి

బెంగళూరు: యువ స్మిమ్మర్ ధినిధి డెసింఘు సంచలనం సృష్టించింది. 14 ఏళ్ల వయసులోనే ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన.. పారిస్ బరిలోకి దిగనున్న అతి పిన్న భారత ప్లేయర్‌గా రికార్డుల్లోకెక్కింది. తొమ్మి దో తరగతి చదువుతున్న ధినిధి.. భార త ఒలింపిక్ జట్టులో చోటు దక్కించుకుంది. ఒలింపిక్ క్వాలిఫికేషన్ పోటీ ల్లో భారత మహిళ స్విమ్మర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా.. ర్యాంకింగ్ పరం గా దేశంలో తొలి స్థానంలో ఉన్న ధినిధికి విశ్వక్రీడల్లో పోటీపడే అవకాశం దక్కింది. ‘నా తోటి వాళ్లంతా ఆటపాటల్లో మునిగే సమయంలో నేను ఈత కొలనులో సాధన చేసేదాన్ని.. అప్పుడు కొన్నిసార్లు బాధగా అనిపించినా.. పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికవడంతో అదంతా మటుమాయం అయింది. 14 ఏళ్ల వయసులోనే అత్యున్నత పోటీల్లో పాల్గొనే చాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది’ అని ధినిధి చెప్పింది.