calender_icon.png 2 March, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యాయత్నం కేసులో నలుగురు యువకులకు రిమాండ్

01-03-2025 10:23:33 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): జనకాపూర్ గ్రామానికి చెందిన దుర్గం మహేందర్ పై గత నెల 28న కత్తితో పొట్ట భాగంలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు బెల్లంపల్లి రూరల్ సీఐ సయ్యద్ అఫ్జలుద్ధిన్(Bellampalli Rural CI Syed Afzaluddin) తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చర్లపల్లి గ్రామానికి చెందిన సోమయ్యకు చెందిన బొలెరో వాహనాన్ని నడుపుకుంటూ జీవిస్తున్న దుర్గం మహేందర్ చర్లపల్లి సమీపంలో కంకులు అమ్ముకోవడానికి గుడిసె వేస్తుండగా దుర్గం సన్నీ కోట బానేష్, కుంటల ఆదిత్య అనే ముగ్గురు వ్యక్తులు వచ్చి అతడిని చంపుతామని బెదిరించినట్టు తెలిపారు. వారి మధ్య గతంలో ఉన్న పాత గొడవలను దృష్టిలో పెట్టుకొని బెదిరించినట్లు తెలిపారు. మరుసటి రోజు దుర్గం సన్నీ కత్తితో దుర్గం మహేందర్ ను కడుపులో పొడవడంతో మహేందర్ కేకలు వేయడంతో నలుగురు వ్యక్తులు భయపడి పారిపోయారు. శనివారం సాయంత్రం పక్క సమాచారంతో దాడికి పాల్పడిన నలుగురు వ్యక్తులతో పాటు, కత్తిని, బైకులను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అరెస్టు చేసిన నలుగురిని జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు సీఐ చెప్పారు. ఈ కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్సై చుంచు రమేష్ పాల్గొన్నారు.