calender_icon.png 23 February, 2025 | 11:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్యాయత్నం కేసులో నిందితుడికి నాలుగేండ్లు జైలు

21-02-2025 12:00:00 AM

కొత్తగూడెం ఫిబ్రవరి 20 ః భద్రాద్రి కొత్తగూడెం జిలా కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి బత్తుల రామారావు నిందితుడికి నాలుగు సంవత్సరంల కఠిన కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పు చెప్పారు. కేసు వివరాలలోకి వెళ్తే. భద్రాచలం రాజుపేట కు చెందిన పోసారపు జాన్ రాజు గుడిమల్ల యాదగిరి వద్ద రెండు పోర్షన్లలో, ఒక పోర్షన్ షాపు కొని ఐదు నెలల నుండి బట్టల షాప్ నడుపుచున్నాడు. మరో పోర్షన్లో గుడి మల్ల యాదగిరి కుటుంబం జీవిస్తున్నారు.

యాదగిరి కుమారుడగు గుడిమల్ల జగదీష్  తన షాపు పెట్టినప్పటి నుండి ఫ్లోరింగ్ రాళ్లు పగలగొట్టడం,గుట్కా ప్యాకెట్లు తన షాపులో వేసి న్యూసెన్స్ చేస్తుండేవాడు. చాలాసార్లు మందలి%ళి%చి నప్పటికిని కక్ష పెంచుకొని తన ఇద్దరు కూతుర్లలో పెద్ద కూతురు పోసారపు హిందూ వర్షిత గొంతు కోయగా,తన భార్య ఫోను చేసి చెప్పగా వెంటనే వచ్చి భద్రాచలం డాక్టర్ మోహన్ రావు హాస్పిటల్‌లో చికిత్స చేయించి 2015- మే -27న ఫిర్యాదు చేయగా అప్పటి భద్రాచలం టౌన్ అడిషనల్ ఎస్సు మహమ్మద్ లాల్ మహమ్మద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు  అంతరం కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేశాడు. కోర్టులో ఎనిమిది మంది సాక్షులను విచారించారు. 

గుడిమళ్ల జగదీష్ పై నేరం రుజువుగా కాగా, జడ్జి నాలుగు సంవత్సరముల కఠిన కారకార శిక్ష రెండు వేల రూపాయల జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు.ప్రాసిక్యూషన్ ను కారం రాజారావు నిర్వహించారు.. భద్రాచలం టౌన్ సిఐ భరపాటి రమేష్ , నోడల్ ఆఫీసర్  జి.ప్రవీణ్ కుమార్,లైజాన్ ఆఫీసర్ ఎం. శ్రీనివాస్, బిసిఎమ్‌పిసి (కోర్టు డ్యూటీ ఆఫీసర్) వై.సుధీర్ బాబులు సహకరించారు.