తల్లి వద్దకు పరుగెత్తుతూ పడిపోయిన ప్రహర్షిక
ఆసుపత్రికి తరలించేలోపే మృతి
ఖమ్మం, నవంబర్ 19 (విజయక్రాంతి): గుండెపోటుతో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన హృదయ విదారక ఘటన ఖమ్మం రూరల్ మండలం వి.వెంకటాయపాలెం గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వి.వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వినోద్, లావణ్య దంపతులకు ఒక్కగానొక్క కూతురు ప్రహర్షిక(4) ఉన్నది. మంగళవారం లావణ్య గ్రూప్ పరీక్ష రాసి ఇంటికి రాగా ప్రహర్షిక తల్లిని చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చాతిలో నొప్పిగా ఉన్నదని ప్రహర్షిక తెలుపడంతో హుటాహుటినా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు కోల్పోయింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్కగానొక్క కుమార్తె కళ్లముందే గుండెపోటుతో ప్రాణాలు కోల్పోవడాన్ని తల్లిదండ్రులు జీర్ణించు కోలేకపోతున్నారు.