శాసన సభ్యుడు తూడి మేఘారెడ్డి
వనపర్తి, జనవరి 26 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకేసారి అమలు చేస్తున్న నాలుగు సంక్షేమ పథకాలను వనపర్తి మండలంలోని అప్పాయపల్లిలో జిల్లా కలె క్టర్ ఆదర్శ్ సురభితో కలిసి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి ప్రారంభించారు. ప్రారంభానికి ముందు గ్రామ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి సందేశాన్ని వీడియో ద్వారా వినిపించారు. అనంతరం పథకాలకు ఎంపికైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను పార్టీలకతీతంగా, అత్యంత పారదర్శకంగా నిజమైన ప్రతి లబ్ధిదారునికి పథకం ఫలాలు అందే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
అనంతరం, గోపాల్పేట మండల పరిధిలోని చెన్నూరు గ్రామంలో కూడా నాలుగు ప్రతిష్టాత్మక పథకాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జారీ చేశారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారులు ఆర్డీవో సుబ్రహ్మణ్యం, జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, వనపర్తి తహసిల్దార్ రమేష్ రెడ్డి, గోపాల్పేట తహసిల్దార్ తిలక్ రెడ్డి, ఎంపీడీవోలు, ప్రజా ప్రతినిధులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.