లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో భూ సమస్యలపై సర్వే
హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 11 (విజయక్రాంతి)/యాచారం: రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో 4,465 భూసంబంధ సమస్యలున్నట్లు లీఫ్స్ సంస్థ అధ్యక్షులు భూమి సునీల్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా భూ సంబంధిత అంశాలపై రైతుల నుంచి దరఖాస్తులు సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. పైలెట్ ప్రాజెక్ట్ కింద యాచారం మండలంలో భూ న్యాయ శిబిరాలను ఏర్పాటు చేసి రైతుల నుంచి సమస్యలను సేకరించగా.. ఈ ఒక్క మండలంలోనే 4,465 సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు.
వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సమక్షంలో బుధవారం ఆర్డీవోకు సమస్యలతో కూడిన నివేదికను అందజేశారు. ఈ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ శాఖ అధికారులకు సహకరిస్తామని చెప్పారు. కార్యక్రమంలో లీఫ్స్ సంస్థ ఉపాధ్యక్షులు జీవన్, న్యాయవాదులు మల్లేశ్, అభిలాష్, సందీప్, రవి, సలహాదారులు కరుణాకర్ రెడ్డి, యా చారం తహసీల్దార్ అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.