హైదరాబాద్: సికింద్రాబాద్ లోతుకుంటలోని గ్రిల్ హౌస్ లో షవర్మ తిని నలుగురు అస్వస్థతకు గురయ్యారు. షవర్మ తిని వాంతులు, విరేచనాలు కావడంతో ఆసత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. అస్వస్థత ఘటనతో 15 రోజుల క్రితం గ్రిల్ హౌస్ మూసివేశారు. గ్రిల్ హౌస్ నిర్వాహకులు మూడు రోజుల క్రితమే షాపు తెరిచి షవర్మ విక్రయించారు. ఇటీవల బంజారాహిల్స్ పరిధిలో మోమోస్ తిని పలువురు అస్వస్థకు లోనవగా ఒక మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటివకే హైదరాబాద్ లోని హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేస్తున్నారు.