01-02-2025 12:52:11 AM
చెన్నై: ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌మూడోతరం జ నరేషన్ పాట్‌ఫామ్‌పై రూపొందిన విద్యుత్ ద్విచక్ర వాహనాలను శుక్రవారం లాంచ్ చేసింది. ఎస్1 ఎక్స్, ఎస్1 ఎక్స్+, ఎస్1 ప్రో, ఎస్1 ప్రో+ పేరిట మొత్తం నాలుగు రకాల స్కూటర్లను వివిధ బ్యాటరీ ఆప్షన్లలో తీసుకొచ్చింది.
వీటి ధరలు రూ.79 వేల నుంచి ప్రారంభమై గరిష్ఠంగా రూ.1.69 లక్షల వరకు ఉన్నాయి. గతంలో ఉన్న జనరేషన్3 ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ స్కూటర్లు సామర్థ్యం, భద్రత పరంగా మె రుగైన పనితీరు కనబరుస్తాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.
పవర్ పరంగా 20 శాతం, 11 శాతం తక్కువ ఖర్చుతో 20 శాతం అధిక రేంజ్‌తో ఈ స్కూటర్లు తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది. డ్యూయల్ ఏబీఎస్, బ్రేక్ బై వైర్ సదుపాయం వంటివి వీటికి జో డించినట్లు పేర్కొంది.
ఈ కొత్త స్కూటర్లు విద్యు త్ స్కూటర్ల మార్కెట్‌ను మరో మెట్టు ఎ క్కిస్తాయని కంపెనీ సీఈఓ భవీశ్ అగర్వాల్ పేర్కొన్నారు. నేటినుంచే (జనవరి 31) ఆర్డర్లు ప్రారంభం అవుతాయని, ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీలు మొదలవుతాయని పేర్కొంది. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ మోటార్ సైకిల్‌ను ఫిబ్రవరి 5 న లాంచ్ చేయనున్నట్లు వె ల్లడించింది.