calender_icon.png 31 January, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నల్లగొండలో నాలుగు పథకాలు ప్రారంభం

27-01-2025 12:00:00 AM

ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రారంభించిన ఎమ్మెల్యేలు

నల్లగొండ, జనవరి 26 (విజయక్రాంతి) : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ర్టం ప్రభుత్వం నాలుగు కీలక సంక్షేమ పథకాలను ఆదివారం పట్టాలెక్కించింది. రైతుభరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులకు మండలానికి ఓ గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడి లబ్ధిదారులకు పథకాలను అందించింది.

నల్లగొండ జిల్లాలోని ఆయా నియోజక వర్గాల్లోని ఎంపిక చేసిన గ్రామాల్లో ఎమ్మెల్యేలు, మండల ప్రత్యేకాధికారులు పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. వేములపల్లి మండలం అన్నపురెడ్డిగూడెంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డి, కొండమల్లేపల్లి మండలం చెన్నంనేనిపల్లిలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్, కేతేపల్లి మండలం ఇప్పలగూడెంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించారు.చౌటుప్పల్ మండలం మసీదుగూడెంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి పథకాన్ని ప్రారంభించారు.