calender_icon.png 22 February, 2025 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాలుగు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

20-02-2025 12:00:00 AM

  1. రెవెన్యూ, పోలీసుల ఉక్కుపాదం

  2. కొంతమంది వ్యక్తుల నుంచి అధికారులకు బెదిరింపులు..? 

చిట్యాల, ఫిబ్రవరి 19 (విజయక్రాంతి) : ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను రెవెన్యూ, పోలీసు అధికారులు బుధవారం పట్టుకున్నారు.అయితే గత పది రోజుల క్రితం ‘విజయ క్రాంతి’ దినపత్రికలో ‘అడిగేది ఎవరు? అడ్డుకునేది ఎవరు?’ శీర్షికన అక్రమ ఇసుక రవాణాపై కథనం ప్రచురితమైంది.ఈ మేరకు స్పందించిన  అధికారులు గత పది రోజుల నుంచి ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడానికి పకడ్బందీ చర్యలను ముమ్మరం చేశారు.ఇందులో భాగంగా మండలంలోని కాల్వపల్లి  గ్రామ శివారు మానేరు వాగు నుంచి మండల కేంద్రం మీదుగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఏలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో ట్రాక్టర్ యజమానులు మేకల తిరుపతి,గజనాల మహేందర్,బోయిని రాజయ్య, ఎర్రవేని లలితపై కేసు నమోదు చేసినట్లు ఎస్సు శ్రావణ్ కుమార్ తెలిపారు.