* ఎన్‌కౌంటర్‌లో మట్టుబెట్టిన ఎస్టీఎఫ్
లక్నో, జనవరి 21: ఉత్తరప్రదేశ్‌లో నలుగురు గూండాలను ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్) మట్టుబెట్టింది. వీరం తా ముస్తఫా కగ్గా గ్యాంగ్‌లోని సభ్యులని మంగళవారం ఎస్టీఎఫ్ అధికారులు తెలిపారు. షామ్లీ జిల్లాలోని ఝింఝినా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి హర్యానా సరిహ ద్దుకు సమీపంలో ఎన్‌కౌంటర్ జరిగింది.
ఎన్‌కౌంటర్‌లో హతమైన ముగ్గురు నేరస్తులను సహన్‌పూర్ వాసి అర్షద్, సోనిపట్ వాసి మంజీత్‌సింగ్, కర్నాల్ నివాసి సతీశ్‌కుమార్‌గా గుర్తించారు. నాలుగో వ్యక్తి ఎవరనేది నిర్ధారిస్తున్నామని యూపీ అదనపు డైరెక్టర్ జనరల్(లా అండ్ ఆర్డర్) అమితాబ్ యష్ తెలిపారు. షామ్లీలో ఓ వాహనంలో ప్రయాణిస్తూ హర్యానా వైపు వెళ్తున్న రౌడీలను మీర ట్‌కు చెందిన ఎస్టీఎఫ్ బృందం అడ్డుకునేందుకు ప్రయత్నించగా ఈ ఎన్‌కౌంటర్ జరిగిం ది.
నేరస్తులు ఎస్టీఎఫ్ బృందంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీనికి ప్రతి గా పోలీసులు కాల్పులు ప్రారంభించారు. వాహనంలోనే ముగ్గురు నేరస్తులు మరణించారు. నాలుగో వ్యక్తి తప్పించుకోవడానికి ప్రయత్నించగా కాల్చిచంపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఎస్టీ ఎఫ్ బృందానికి నాయకత్వం వహిస్తున్న ఇన్‌స్పెక్టర్ సునీల్‌కుమార్‌కు కడుపులో మూడు బుల్లెట్లు దిగగా.. గుర్గావ్‌లోని మేదాంత ఆస్పత్రికి తరలించారు. హత మైన వారిలో అర్షద్ యూపీ, హర్యానాలో 17 దోపిడీ, హత్యకేసు ల్లో నిందితుడు. మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నాడు. అతడిని పట్టుకుంటే రివార్డు ప్రకటించారు.