16-03-2025 03:35:34 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం గ్రామపంచాయతీ కార్యదర్శి యాదగిరి సంతకాన్ని ఫోర్జరీ చేసిన కేసులో నలుగురిని(4) ఆదివారం రిమాండ్ చేసినట్టు ఎస్ఐ డీ.స్రవంతి తెలిపారు. నకిలీ రసీదులు, లెటర్ ప్యాడ్లు, రబ్బర్ స్టాంపులతో దొరికిన నలుగురిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.ఇలాంటి సంఘటనపై ఎవరైనా పాల్పడుతున్నట్లు సమాచారం తెలిసిన, ఎవరైనా మీ దృష్టికి వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్సై స్రవంతి సూచించారు.