calender_icon.png 10 January, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లారీని ఢీకొన్న ట్రావెల్ బస్సు.. నలుగురు మృతి

10-01-2025 10:04:55 AM

సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురం వద్ద  శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో 18 మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుప్తా ట్రావెల్స్ నడుపుతున్న బస్సు ఒడిశా నుండి హైదరాబాద్‌కు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు సహా నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మారణం చెందారు.

ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 32 మంది ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది పని కోసం ఓ ఏజెన్సీ ద్వారా హైదరాబాద్‌కు వెళ్తున్నట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న చివ్వెంల పోలీసులు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఘటనకు సంబంధి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.