పటాన్‌చెరు, డిసెంబర్ 2: అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని శ్రీవాణి నగర్‌లో అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న షేక్ మీరావలి, సహదేవ్‌రాజు, రవీందర్, దుర్గారెడ్డిపై కేసు నమోదు చేసి తహసీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు ఎక్సైజ్ సీఐ సోమవారం తెలిపారు. వారు మద్యం రవాణాకు వినియోగిస్తున్న మూడు స్కూటీలను, 46 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
నేడు వాహనాల వేలం
వివిధ గంజాయి రవాణా కేసుల్లో పట్టుబడిన మూడు బైక్‌లను పటాన్‌చెరులోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం వేలం వేస్తున్నట్లు ఎక్సై జ్ సీఐ తెలిపారు. ఆసక్తి ఉన్న వ్యక్తులు ఉదయం 10గంటల వరకు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్‌కు రావాలన్నారు.