10-04-2025 10:29:53 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బట్వాన్ పల్లి గ్రామంలో గురువారం పిచ్చికుక్క నాలుగేళ్ల చిన్నారితో పాటు గుర్రాల మల్లక్క, సబ్బని ముక్తేష్, సంకురి లక్ష్మి, ప్రశాంత్ అనే వ్యక్తులను దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. గ్రామంలోని క్రిస్టియన్ కాలనీ, గొల్లవాడ, తెనుగు వాడలో తిరుగుతూ పిచ్చికుక్క గ్రామస్తులను గాయపరిచింది. గాయపడ్డ వ్యక్తులను బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వారికి చికిత్స అందిస్తూ మెరుగైన చికిత్స కోసం మంచిర్యాలకు తరలించారు.