calender_icon.png 1 April, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పండుగ పూట కామారెడ్డి జిల్లాలో విషాదం

30-03-2025 10:36:11 AM

ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

అర్ధరాత్రి నుంచి గాలింపు చర్యలు

ఉదయం లభ్యమైన శవాలు

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy district)లో పండుగ పూట ఓ గ్రామంలో విషాదం నెలకొంది.  ఓకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడం కలకలం రేపుతుంది. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్థానికులు, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం(Yellareddy mandal) వెంకటాపూర్ గ్రామ శివారులోని పెద్ద చెరువు బ్యాక్ వాటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎల్లారెడ్డి సీఐ రవీందర్, ఎస్సై మహేష్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటాపూర్ గ్రామానికి చెందిన మౌనిక (26) వారి పిల్లలు మైథిలి (10) అక్షర (9 )వినయ్(7) లతో కలిసి శనివారం మధ్యాహ్నం చెరువు వద్దకు బట్టలు ఉతకడానికి వెళ్ళింది. పిల్లలు నీటిలో స్నానం చేసేందుకు వెళ్లారు.

ఆడుకుంటూ లోనికి వెళ్లడంతో గతంలో అక్కడ గుంత తీసి ఉండడంతో అందులో నీరు ఉండడంతో గమనించని పిల్లలు ఆ గుంతలో చిక్కుకొని గల్లంతయ్యారు. గుంతలో చిక్కుకొని మునిగిపోయారు. వారిని గమనించిన పినతల్లి మౌనిక వారిని కాపాడేందుకు ప్రయత్నించి ఆమె కూడా గుంతలో చిక్కుకొని మృతి చెందింది. సాయంత్రం అయినా కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించ గా చెరువు ఒడ్డున దుస్తులు కనిపించడంతో వెతకడం ప్రారంభించారు. అర్ధరాత్రి వినయ్ మృత దేహం లభించగా  ఆదివారం ఉదయం వరకు వెతకగా మరో ముగ్గురు మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. నలుగురు మృత దేహాలను ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉగాది పండుగ(Ugadi festival) పూట ఈ ఘటన వెలుగులోకి రావడంతో వెంకటాపూర్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడడం ఈ ఘటన తీవ్రంగా గ్రామస్తులను కలచివేసింది. ఎల్లారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.