29-04-2025 12:08:46 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి నలుగురు పాకిస్థానీయులు స్వదేశానికి తిరిగి వెళ్లిపోయారు. నలుగురిలో ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు, మరో బాలుడు ఉన్నారు. వారు ఆదివారమే నగరం నుంచి వెళ్లినట్లు అధికారులు పేర్కొన్నారు. ఏప్రిల్ 22వ తేదీన జమ్మూకశ్మీర్ లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ దేశస్థులు ఈనెల 30లోపు భరత్ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించింది. పాకిస్థానీయులకు కేంద్రం విధించిన గడువు నేటితో ముగియనుండడంతో తెలంగాణ రాష్ట్రంలో మరికొంత పాకిస్థానీయులకు సంబంధించిన పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. దేశంలో షార్ట్ టర్మ్, మెడికల్ వీసాపై వచ్చిన వారిని పాక్ కు పంపేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈనెల 30 లోపు ఆటరీ బోర్డర్ నుంచి వెళ్లాలని పోలీసులు సూచనలు జారీ చేశారు. మూడు పోలీసు కమీషనరేట్ల పరిధిలో 247 మంది పాక్ పౌరులను గుర్తించారు. అదులో నలుగురు మాత్రమే తాత్కాలిక వీసాపై వచ్చినట్లు నిర్ధారించిన పోలీసులు వారు రోడ్డు మార్గంలో సరిహద్దుకు చేరి పాక్ వెళ్లినట్లు వెల్లడించారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు పాకిస్థానీయులకు లాంగ్ టర్మ్ వీసాలు, సైబరాబాద్ పరిధిలో 11 మందికి లాంగ్ లాంగ్ టర్మ్ వీసాలు, నిజామాబాద్ లో 8 మందికి లాంగ్ టర్మ్ వీసాలు కలిగిన వారు ఉన్నారు. వీరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా 230 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లాంగ్ టర్మ్ వీసాలున్న వాళ్లకి కేంద్రం హోంశాఖ మినహాయింపు ఇచ్చింది.