9 తులాల బంగారం, కిలో వెండి, రూ.50వేల నగదు సీజ్
కల్వకుర్తి, నవంబర్ 2: చోరీ కేసు ల్లో నలుగురు పాత నేరస్థులను నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ పోలీసులు పట్టుకున్నారు. వెల్దండ సీఐ విష్షువర్ధన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారబాద్ జిల్లా బంట్వారం మండ లం తోర్మామిడి గ్రామానికి చెందిన మానిఖ్యం(మని) వెల్డింగ్ పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు.
నాగర్‌కర్నూల్ జిల్లా బల్మూర్ మండ లం తుమ్మన్‌పేట గ్రామానికి చెందిన బాల్‌రాజు సంగారెడ్డి జిల్లా బొల్లారం ప్రాంతంలో నివాసం ఉంటూ మేస్త్రీ పనిచేచేవాడు. ఈ ఇద్దరికి మరో ఇద్ద రు మైనర్లు స్నేహితులు. వ్యసనాలకు బానిసైన వీరు సులువుగా డబ్బు సంపాదించేందుకు చోరీల బాటపట్టారు. గతంలో జైలుకు వెళ్లి వచ్చిన వీరిలో మార్పు రాలేదు.
గత 20రోజుల క్రితమే జైలు నుంచి బయటికి వచ్చారు. వెంటనే వంగూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగాపూర్ గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంట్లో రూ.90వేల విలువజేసే బంగారం, వెండిని చోరీ చేశారు. శుక్రవారం వెల్దండ సర్కిల్ పోలీసులు తనిఖీలు చేపడుతున్న క్రమంలో నలుగురు పట్టుబడ్డారు. వారి నుంచి 9తులాల బంగారం, 1.2కిలోల వెండి, రూ.50 వేల నగదు, కారు, రెండు సెల్‌ఫోన్లు సీజ్ చేసినట్టు సీఐ, వంగూరు ఎస్సై మహేందర్ తెలిపారు.