calender_icon.png 21 November, 2024 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన నలుగురు అధికారులు

21-11-2024 12:59:43 AM

రూ.౭5వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (విజయక్రాంతి) : ఏసీబీకి ఇద్దరు అవినీతి అధికారులు పట్టుబడ్డారు. మలక్‌పేట్-2 సర్కిల్ కమర్షియల్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ కమిషనర్(ఎస్టీ)గా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ బాషా, అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సోమశేఖర్ బుధవారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

ఓ వ్యాపారి తన సంస్థకు చెందిన ఫ్రీజ్ చేయబడిన బ్యాంకు ఖాతాను పునరుద్ధరించడానికి సంబంధిత అధికారుల అనుమతి లేఖ కోసం అధికారులను కలవగా.. సదరు వ్యాపారి నుంచి రూ.లక్ష డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. బుధవారం ఆ వ్యాపారి నుంచి రూ.50వేలు తీసుకుం టుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం నిందితులను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. 

ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు.. 

జీహెచ్‌ఎంసీ సర్కిల్ -18 జూబ్లీహిల్స్‌లో శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న జి.రమేశ్, ఎండీ.సలీంఖాన్(అవుట్ సోర్సింగ్) లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాఫీ షాప్ యజమానికి విధించిన జరిమానాను మాఫీ చేయడానికి రూ.60వేలు డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా.. బుధవారం ఆ వ్యాపారి నుంచి రూ.25వేలు లంచం తీసుకంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నింది తులను నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.