calender_icon.png 9 January, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజురాబాద్ నియోజకవర్గంలో నాలుగు కొత్త మండలాలు ఏర్పాటు చేయాలి

08-01-2025 12:51:04 PM

హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

 హుజురాబాద్,విజయక్రాంతి: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటు చేయాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Huzurabad MLA Padi Kaushik Reddy) ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ఉప్పల్, శనిగరం, వావిలాల, చల్లూరులను వెంటనే నాలుగు మండలాలుగా ప్రకటించాలని బుధవారం హైదరాబాదులోని తన స్వగృహంలో మాట్లాడారు. ఈ నాలుగు గ్రామాలకు మండలాలుగా ప్రకటించేందుకు కావలసిన అన్ని అర్హతలు ఉన్నాయని, దీంతో నియోజకవర్గం లోని ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. మండలాల ఏర్పాటుతో నియోజకవర్గ అభివృద్ధి కూడా జరుగుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని వెంటనే ఈ నాలుగు గ్రామాలను మండలాలుగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.