calender_icon.png 11 April, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్ల మున్సిపాలిటీలోకి మరో నాలుగు గ్రామాలు

27-03-2025 12:30:10 AM

అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి శ్రీధర్ బాబు 

చేవెళ్ల, మార్చి 26: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మున్సిపాలిటీలోకి మరో నాలుగు గ్రామాలు చేరనున్నాయి. ఈ మేరకు బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభ వ్యవహారాలు, ఐటీ, ఇండస్ట్రీస్, జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.  ప్రకటన చేశారు. దీంతో చేవెళ్ల మున్సిపాలిలో వీలినం అయిన గ్రామాల సంఖ్య 12 కు చేరనుంది.  ఇది వరకు  దామరిగిద్ద, ఇబ్రహీంపల్లి, కేసారం, దేవుని ఎర్రవల్లి, మల్కాపూర్, ఊరెళ్ల, చేవెళ్ల, రామన్నగూడ ను విలీనం చేసి మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు.  తాజాగా పామెన, కందవాడ, పలుగుట్ట, మల్లారెడ్డి గూడను కూడా కలుపనున్నట్లు మంత్రి ప్రకటించారు.కాగా, అధికారులు గత డిసెంబర్ 12 గ్రామాలతోనే మున్సిపాలిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు పంపారు. కానీ,  రాజకీయ ఒత్తిళ్ల కారణంగా 8 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటు చేశారు. అయితే దగ్గరగా ఉన్న గ్రామాలను వదిలేసి దూ రంగా ఉన్న వాటిని విలీనం చేశారని ఆయా గ్రామాల ప్రజల నుంచి విమర్శలు వచ్చాయి. దీంతో ప్రతిపాదనల్లో నుంచి పక్కన పెట్టిన గ్రామాలను మళ్లీ చేర్చినట్లు తెలిసింది.