న్యూఢిల్లీ, జనవరి 25: కాల్పుల విరమణ ఒప్పందం ప్రకా రం ఇజ్రాయెల్‌కు చెందిన నలుగురు మహిళా సైనికులను హమాస్ విడుదల చేసింది. కరీనా అరివ్, డానియెల్లా గిల్బోవా, నామా లెవి, లిరి అల్బాజ్ అనే మహిళ సైనికులను హమాస్ శనివారం రెడ్‌క్రాస్ ప్రతినిధులకు అప్పగించింది.
ఈ మహిళా సైనికులను 2023, అక్టోబర్ 7న గాజా సరిహద్దుకు సమీపంలోని నహల్ ఓజ్ మిలిటరీ బేస్ వద్ద అదుపులోకి తీసుకున్న హమాస్.. 477 రోజులపాటు బంధించింది. ఇందుకు ప్రతిగా 200పైగా బందీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టాల్సి ఉంది.
హమాస్, ఇస్లామిక్ జిహాద్, పాపులర్ ఫ్రంట్ ఫర్ ది లిబరేషన్ ఆఫ్ పాలస్తీన(పీఎఫ్ఎల్పీ)లకు చెందిన 200 ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెడుతుందని భావిస్తున్నట్టు హమాస్ పేర్కొంది. కాల్పుల విరమణ ప్రారంభమైన తొలిరోజు ముగ్గురు మహిళా బందీలను హమాస్ విడుదల చేయగా.. వందకుపై గా పాలస్తీనా పౌరులను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది.