11-03-2025 07:49:32 AM
హైదరాబాద్: నగరంలోని హబ్సిగూడలో(Habsiguda) మంగళవారం దారుణం చోటుచేసుకుంది. కుమారుడు, కుమార్తెను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతులు చంద్రశేఖర్ రెడ్డి(44), కవిత(35), శ్రీతరెడ్డి(15), విశ్వాన్ రెడ్డి(10)గా పోలీసులు గుర్తించారు. కొంతకాలం ప్రేవేటు కళాశాలతో చంద్రశేఖర్ రెడ్డి లెక్చరర్(Lecturer)గా పనిచేస్తున్నాడు. మృతుల స్వస్థలం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి(Kalwakurthy, Nagarkurnool district) మండలం ముకురాళ్లగా పోలీసులు నిర్ధారించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.