14-03-2025 05:51:16 PM
నిర్మాణ పనుల తీరుపై అసంతృప్తి
పట్టించుకోని వైరా ఆర్ అండ్ బి అధికారులు
వైరా,(విజయకాంతి): వైరాలోని మధిర రోడ్ లో రోడ్డు వెడల్పు నాలుగు లైన్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. సదరు కాంట్రాక్టర్ కనీసం నీళ్లు చల్లించకపోవడంతో దుమ్ముతో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. బస్సు, లారీ వంటి పెద్ద వాహనాలు వాహనాలు అటుగా ప్రయాణం చేస్తే విపరీతంగా దుమ్ము లేచి ఆరోగ్యానికి, ఇటు రోడ్డు ప్రమాదాలకు కూడా సంభవించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అటు రోడ్డుగా ప్రయాణించాలంటే వాహనదారులు జంకుతున్నారు. నిర్మాణ పనుల తీరుపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైరా ఆర్ అండ్ బి అధికారులు ఈ విషయాలు దృష్టికి వచ్చినా కూడా పట్టించుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కనీసం పర్యవేక్షణ కూడా కరువైందని అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.