బరూచ్: గుజరాత్‌లోని బరూచ్ జిల్లాలోని దహేజ్‌లో రసాయన కర్మాగారంలో విషవాయువు పీల్చి(Toxic Gas) నలుగురు కార్మికులు మృతి చెందినట్లు పోలీసులు ఆదివారం తెలిపారు. శనివారం రాత్రి 10 గంటల సమయంలో గుజరాత్ ఫ్లోరోకెమికల్స్ లిమిటెడ్ (Gujarat Fluorochemicals Ltd) ప్రొడక్షన్ యూనిట్‌లో పైపు నుండి వెలువడే విషపూరిత పొగలను పీల్చడంతో వారు స్పృహతప్పి పడిపోయారని దహేజ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బిఎమ్ పాటిదార్ తెలిపారు. నలుగురు కార్మికులను భరూచ్(Bharuch district)లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు మరణించగా, మరొకరు ఉదయం 6 గంటలకు మరణించినట్లు అధికారి తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి, తదుపరి విచారణ జరుపుతున్నామని అధికారి తెలిపారు.