అమరావతి: తిరుపతి జిల్లాలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ లారీ కారు, బైకును ఢీకొట్టింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. కలగడ నుంచి చెన్నైకి టమాట లోడ్ తో వెళ్తోన్న కంటైనర్ లారీ అదుపుతప్పి కారుపై పడింది. ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు స్పాట్ లోనే చనిపోయారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయచర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.