calender_icon.png 23 December, 2024 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంభాల్‌లో పికప్ ట్రక్ ఢీకొని నలుగురు మృతి

16-09-2024 12:45:53 PM

సంభాల్ (యుపి): ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం సంభాల్ లో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన  పికప్ ట్రక్కు ప్రజలపైకి దూసుకెళ్లడంతో నలుగురు వ్యక్తులు మృతి చెందగా, ఐదుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అలీగఢ్‌కు తరలించగా, వాహనం డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

పోలీసు సూపరింటెండెంట్ క్రిషన్ కుమార్ మాట్లాడుతూ, ఉదయం 6 గంటలకు, భోపత్‌పూర్ గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రోడ్డు పక్కన కూర్చొని ఉండగా, గవా నుండి ఎదురుగా వస్తున్న వాహనం వారిని అతి వేగంతో ఢీకొట్టింది. దీని కారణంగా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మృతులను లీలాధర్ (60), ధరమల్ (40), ఓంపాల్ (32), పురన్ సింగ్ (45)గా గుర్తించారు. క్షతగాత్రులను వెంటనే రాజ్‌పురాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి, అక్కడి నుంచి వైద్య చికిత్స కోసం అలీఘర్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.